NLG: నాగార్జున సాగర్ నియోజకవర్గ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు కొండమల్లేపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. కార్యకర్తలు ఉత్సాహంతో ‘సీఎం.. సీఎం’ అంటూ నినాదాలు చేయగా, హరీష్ రావు సున్నితంగా వాటిని వారించారు. అనంతరం స్థానిక నాయకులతో సమావేశమైన ఆయన, నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే దిశగా దిశానిర్దేశం చేశారు.