TG: రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 26 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం, క్యూములోనింబస్ మేఘాలతో వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్, కుమురంభీం, మంచిర్యాల, ములుగు, భద్రాద్రి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు వర్ష సూచన ఉందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.