BHNG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన రాజీవ్ యువ వికాస్ పథకం అమలులో విఫలం అయిందని, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ విమర్శించారు. శనివారం ఆలేరు పట్టణ కేంద్రంలో డీవైఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు.