MDCL: ఉప్పల్ కాంగ్రెస్ అధ్యక్షుడు పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. గత రెండేళ్లలో కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా కాప్రా చెరువు అభివృద్ధికి రూ. 35 కోట్లు మంజూరు చేసి పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రాంతీయ మౌలిక సదుపాయాల మెరుగుదలకు కట్టుబడి ఉన్నామని, ప్రజలకు మరింత సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమన్నారు.