MDCL: ఘట్కేసర్ పరిధి CHCలో ప్రజలకు 24 గంటల ఎమర్జెన్సీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదాలు, గాయాలు, అకస్మాత్తుగా అనారోగ్యం వంటి పరిస్థితుల్లో వెంటనే చికిత్స అందించే విధంగా వైద్య సిబ్బంది సిద్ధంగా ఉంటారు. ప్రాథమిక చికిత్సతో పాటు అవసరమైతే పెద్ద ఆసుపత్రులకు రిఫర్ చేసే సౌకర్యం కూడా కల్పించారు. స్థానిక ప్రజలు ఈ సేవలను వినియోగించుకోవాలని వైద్యులు సూచించారు.