కృష్ణా: మచిలీపట్నం ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో నియోజకవర్గ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనులు, అవసరమైన నిధుల సమీకరణ గురించి సంబంధిత అధికారులతో మంత్రి కొల్లు రవీంద్ర శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వసతులు కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేశామని, త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.