PLD: నరసరావుపేట మండలం కాకాని గ్రామంలో బుధవారం ఉదయం పోలీసులు భారీ కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ట్రైనీ డీఎస్పీ జయకృష్ణ నేతృత్వంలో 80 మంది సిబ్బంది, 6 బృందాలుగా విడిపోయి ఊర్ని జల్లెడ పట్టారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 15 బైక్లు, ఒక ఆటోతో పాటు కొన్ని కత్తులు, మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగానే ఈ తనిఖీలు చేపట్టారు.