SRCL: రాజకీయంగా తనపై ద్వేషం ఉంటే ఛైర్మన్ పదవికి రాజీనామా చేస్తానని సెస్ ఛైర్మన్ చిక్కాల రామారావు అన్నారు. శుక్రవారం సెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడారు. సెస్ రెన్యూవల్ ప్రభుత్వం చేయక ఇబ్బందులు పెట్టడం సరికాదన్నారు. తంగళ్లపల్లి విద్యుత్ వినియోగదారుల ఆశీర్వాదం, ఎమ్మెల్యే కేటీఆర్ సూచనతో ఛైర్మన్గా ఎన్నికైనట్లు వెల్లడించారు.