Formula E Race షెడ్యూల్ ఇదే.. రయ్ అంటూ రేసర్లు రెఢీ
కొంత ట్రాఫిక్ కష్టాలు ఉన్నప్పటికీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగితే హైదరాబాద్ కే మంచి పేరు. కొన్నింటి కోసం కొన్ని తిప్పలు తప్పవంటూ కొందరు ఈ రేసును ఆహ్వానిస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రపంచ క్రీడ సంబరానికి వేదికగా నిలుస్తుండడంతో హైదరాబాద్ వాసులు భారీ స్వాగతం పలుకుతున్నారు.
ప్రతిష్టాత్మక ఫార్ములా-ఈ (Formula E) ప్రపంచ రేసింగ్ చాంపియన్ షిప్ (ABB FIA Formula E World Championship)నకు వేళైంది. భారతదేశంలోనే ప్రప్రథమంగా ఈ రేసింగ్ (Hyderabad E Prix) హైదరాబాద్ (Hyderabad)లో జరుగనుంది. ప్రపంచ స్థాయి రేసర్లు హైదరాబాద్ రోడ్లపై రయ్యిమంటూ దూసుకెళ్లనున్నారు. శుక్రవారం ప్రీ ప్రాక్టీస్ తో అదరగొట్టగా.. నేడు శనివారం ప్రధాన రేసు మరింత అలరించనుంది. అసలు సిసలైన రేసు నేడే ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. అసలు భారతదేశం (India)లో సరికొత్త అనుభూతిని ఈ రేసు పంచుతోంది. కొంత ట్రాఫిక్ కష్టాలు ఉన్నప్పటికీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఈ స్పోర్ట్స్ ఈవెంట్ జరిగితే హైదరాబాద్ కే మంచి పేరు. కొన్నింటి కోసం కొన్ని తిప్పలు తప్పవంటూ కొందరు ఈ రేసును ఆహ్వానిస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా ప్రపంచ క్రీడ సంబరానికి వేదికగా నిలుస్తుండడంతో హైదరాబాద్ వాసులు భారీ స్వాగతం పలుకుతున్నారు.
తెలంగాణ (Telangana) ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (KTR) ప్రత్యేక శ్రద్ధ కనబర్చి ఈ రేసును హైదరాబాద్ కు తీసుకొచ్చారు. ఇతర నగరాలు ఈ రేసు కోసం పోటీ పడగా హైదరాబాద్ మాత్రమే అర్హత సాధించింది. ప్రపంచ స్థాయి నగరంగా ఎదుగుతున్న మన హైదరాబాద్ లో ఈ రేసు జరుగుతుండడం మనందరికీ గర్వకారణం. హుస్సేన్ సాగర్ తీరంలో 2.8 కిలో మీటర్లు ప్రత్యేకంగా నిర్మించిన సర్క్యూట్ (ట్రాక్)పై రేసర్లు దూసుకెళ్లనున్నారు. ఇప్పటికే ఈ రేసు కోసం ప్రేక్షకులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. టికెట్లు విడుదల చేసిన వెంటనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. తొలిసారి ప్రవేశపెట్టిన అత్యాధునిక జెన్ 3 కార్లతో రేసర్లు రయ్ రయ్ మంటూ దూసుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. రేసింగ్ లో విదేశీ కంపెనీలు, రేసర్లకు పోటీగా భారత రేసర్లు సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. మన దేశం నుంచి మహీంద్ర రేసింగ్, టీసీఎస్ జాగ్వార్ బరిలోకి దిగనున్నాయి.
షెడ్యూల్ ఇదే..
ఉదయం 8.10 నుంచి 8.40 వరకు ఫ్రీ ప్రాక్టీస్-2
ఉదయం 10.40 నుంచి 12.05 వరకు క్వాలిఫయింగ్ రేస్
మధ్యాహ్నం 1.40 నుంచి 1.55 వరకు డ్రైవర్స్ పరేడ్
మధ్యాహ్నం 3.04 నుంచి ప్రధాన రేసు
సాయంత్రం : 4.35 మీడియా సమావేశం
రేసు ప్రత్యేకతలు
– 2013లో ఫార్ములా-1 రేసు తర్వాత భారతదేశంలో జరుగుతున్న తొలి రేసు ఇదే.
– ఫార్ములా -ఈ రేసుకు ఆతిథ్యమిచ్చిన 27వ నగరం హైదరాబాద్.
– 2.8 కిలోమీటర్లు ప్రత్యేకంగా ట్రాక్ తయారు.
– పాల్గొననున్న మొత్తం జట్లు 11
– పాల్గొననున్న రేసర్లు 22 మంది
– ఈ రేసు కోసం రూపురేఖలు మారిన హుస్సేన్ సాగర్ ప్రాంతం.
అయితే శనివారం జరిగిన ప్రాక్టీస్ రేసుకు ప్రముఖులు తరలివచ్చారు. సినీ నటులు మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్, జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి, టీడీపీ నాయకుడు నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి, భారత స్టార్ షట్లర్ పీవీ సింధు తదితరులు హాజరై రేసును తిలకించారు. ఈ సందర్భంగా ప్రేక్షకులతో కలిసి సందడి చేశారు. ఈ క్రమంలో కొందరు అభిమానులతో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. నేడు జరిగే ప్రధాన రేసుకు పెద్ద ఎత్తున సినీ నటులు, పారిశ్రామికవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది.