MBNR: కోయిలకొండ మండల కేంద్రంలో అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై తిరుపాజి మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ జానకి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామన్నారు. ఆటో డ్రైవర్లు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలలు తప్పకుండా పాటించాలన్నారు.