VZM: మెరకముడిదాం మండలం రాచపేట గ్రామ అంగన్వాడీ సెంటర్లో మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ సాధికారిత అధికారిని కె వి బాలమని ఇవాళ పోషణ పక్వాడా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలకి ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన కల్పించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గ్రామస్థాయిలో వివిధ అవగాహన కార్యక్రమాలు, పోషకాహారంపై ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకి సూచించారు.