TG: కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సొంత పార్టీపై పరోక్ష విమర్శలు చేశారు. ‘ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట.. అధికారంలోకి వచ్చాక మరో మాట ఉండకూడదు. కాంగ్రెస్, BRS, BJP ఎవరైనా మాట మీదే ఉండాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించడం, డిమాండ్ చేయడం.. అధికారంలోకి వచ్చాక విస్మరించడం తప్పు. ఏ పార్టీ ఇలా చేసినా తప్పే’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.