ప్రకాశం: రాష్ట్ర సమస్యలపై ప్రధాని మోడీని నిలదీసే ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా చెప్పారు. విశాఖ ఉక్కు పరిరక్షణ కోరుతూ గురువారం ఒంగోలు కలెక్టరేట్ వద్ద రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో సైదా మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిరక్షణకు షర్మిల నడుం బిగించారని, ప్రజలు అందరూ మద్దతు ఇవ్వాలని కోరారు.