SRPT: జిల్లాలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాలను కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గురువారం పరిశీలించారు. ఆకుపాములలో స్కిల్ డెవలప్మెంట్ భవనం, కోదాడలో నూతన అతిథి గృహ పనులను తనిఖీ చేశారు. నాణ్యతతో కూడిన నిర్మాణాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, రమాదేవి పాల్గొన్నారు.