E.G: చాగల్లు మండలంలోని పలు గ్రామాలకు చెందిన 13 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన రూ.7,70,427 విలువ గల చెక్కులను కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సీఎం సహాయ నిధి ఆసరాగా నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.