ATP: మంత్రి నారా లోకేష్ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులు కావడంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. లోకేష్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. అలాగే రాష్ట్ర కమిటీలో చోటు దక్కించుకున్న నలుగురు అనంతపురం నేతలు ఎమ్మెల్యేను కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.