VZM: రహదారి భద్రత, నేర నియంత్రణ, గంజాయి రవాణా నియంత్రించుటకు పట్టణంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. ఈ తనిఖీల్లో వాహన పత్రాలు సక్రమంగా లేని వాహనాలను గుర్తించి, వాటిని సీజ్ చేశామన్నారు. వాహనాలు ప్రమాదాలకు గురైనపుడు సరైన ఇన్సూరెన్స్ లేకుంటే కలిగే అనర్ధాలను వాహనదారులకు వివరించి, వాహనాలకు తప్పనిసరిగా ఇన్సూరెన్సు ఉండాలని సూచించామన్నారు.