NGKL: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా ఏప్రిల్ 16న నిర్వహించే మండల స్థాయి గ్రామ సభలను విజయవంతం చేయాలని కలెక్టర్ సంతోష్ అధికారులను ఆదేశించారు. బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. 99 రోజుల కార్యాచరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, సభలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు.