భారత్‌లో మంకీపాక్స్ (ఎంపాక్స్) కేసుల సంఖ్య మూడుకు చేరింది. తాజాగా కేరళలో మరో మంకీపాక్స్ కేసు నమోదైంది. ఎర్నాకుళం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి మంకీపాక్స్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. అతడి నమూనాలను పరీక్షల కోసం పంపించగా.. పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందన్నారు.