ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌గా మొలకెత్తిన గింజలను తింటే ఆరోగ్యంగా ఉంటారు. బరువు తగ్గాలనుకునే వారికి, షుగర్ కంట్రోల్ ఉండాలనుకునే వారికి మొలకలు మంచివి. వీటిలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. శాఖాహారులకు మొలకలు ప్రొటీన్స్ సోర్స్‌గా చెప్పవచ్చు. వీటిలో ఉండే అమైనో యాసిడ్స్ కండరాల పెరుగుదలకు సహాయపడుతుంది. వీటిలో విటమిన్ A, C, K , బి-కాంప్లెక్స్ ఉంటాయి.