RR: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. శివారు గౌరెల్లిలో అరుదైన జాతికి చెందిన తాబేలు జనావాసాల్లో ప్రత్యక్షమైంది సమీపంలోని జల వనరుల నుంచి ఈ కూర్మం వచ్చినట్లు గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. సాధారణంగా కనిపించే తాబేలు కంటే ఇది ప్రత్యేకంగా ఉంది. పూర్తిగా నలుపు రంగులో ఉంది దీనిని చూసేందుకు జనాలు ఆసక్తి చూపించారు.