కర్నూలు బళ్లారి చౌరస్తా బైపాస్‌లో జరుగుతున్న పనులను నగరపాలక సంస్థ కమిషనర్ పీ. విశ్వనాథ్ మంగళవారం పరిశీలించారు. రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సుల రాకపోకలకు ఆటంకంగా ఉన్న మలుపు వద్ద రెండు షాపులను తొలగిస్తామని, పోలీస్ అనుమతి రాగానే పనులు పూర్తి చేసి ట్రాఫిక్ సమస్యలు తీరుస్తామని కమిషనర్ తెలిపారు.