కృష్ణా: పండుగల సందర్భంగా విజయవాడ మీదుగా MGR చెన్నై సెంట్రల్(MAS), షాలిమార్ (SHM) మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు నం.02841 SHM- MAS ట్రైన్‌ను ఈ నెల 30 నుంచి నవంబర్ 18 వరకు ప్రతి సోమవారం, నం.02842 MAS-SHM ట్రైన్‌ను అక్టోబర్ 2 నుంచి నవంబర్ 20వరకు ప్రతి బుధవారం నడుపుతామని రైల్వే వర్గాలు పేర్కొన్నాయి.