సియాచిన్ బేస్ క్యాంపును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సందర్శించారు. అక్కడి సైనికులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. సాయుధ బలగాలకు అత్యున్నత కమాండర్‌గా.. సైనికులను చూసి చాలా గర్వపడుతున్నట్లు వెల్లడించారు. భద్రత బలగాల ధైర్యసాహసాలకు పౌరులందరూ సెల్యూట్ చేస్తున్నారని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.