HYD: బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వేకువజాము నుంచే అర్చకులు, వేదపండితులు అమ్మవారికి శాస్త్రోక్తంగా అభిషేకాలు చేశారు. అనంతరం వివిధ రకాల పూలతో అమ్మవారిని అత్యంత సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మొక్కులు చెల్లించుకోవడంతో ఆలయం ఎల్లమ్మ తల్లి నామస్మరణతో మార్మోగింది.