AP: కల్తీ నెయ్యిని ఎప్పుడూ తిరుమలలో వాడలేదని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు కొవ్వు ప్రస్తావన తీసుకొచ్చారని ఆరోపించారు. శ్రీవారి ప్రతిష్టను మంటగలిపేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తాను తిరుమలకు 40 సార్లు వెళ్లానని.. 20 సార్లు గుండు కొట్టించుకున్నానని తెలిపారు. మరి చంద్రబాబు ఎన్ని సార్లు గుండు గీయించుకున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి దమ్ముంటే సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.