AP: రామతీర్థంలో గతంలో ధ్వంసమైన సీతారామలక్ష్మణ విగ్రహాల నిమజ్జనం కోటిపల్లి గోదావరి తీరంలో శాస్త్రోక్తంగా ముగిసింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వైఖానస ఆగమశాస్త్రం ప్రకారం శాంతి హోమం నిర్వహించి, విగ్రహాలను జలాధివాసం చేశారు. రామతీర్థం-ద్రాక్షారామం మీదుగా ఊరేగింపుగా వీటిని కోటిపల్లికి తీసుకువచ్చారు. ఆలయ పండితుల నిర్ణయం మేరకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించింది.