TG: HYD ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న దొంగను పోలీసులు అరెస్టు చేశారు. రైలు పట్టాల పక్కన తాళం వేసి ఉన్న ఇళ్లల్లోనే ఎక్కువగా చోరీలు జరిగాయి. అంతర్రాష్ట్ర దొంగ అజయ్ మహావీర్ బుక్తర్ను పోలీసులు పట్టుకున్నారు. రూ. 20.80 లక్షల నగదు, కిలో 250 గ్రాముల వెండి వస్తువులు చోరీ చేశాడు. నిందితుడి నుంచి రూ.2.50 లక్షల నగదు, 250 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నారు.