NRML: తానూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం పోలీసుల ఆధ్వర్యంలో మత్తు పదార్థాల దుష్పరిణామాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మత్తు పదార్థాలను సేవించడం వల్ల యువకులు అనారోగ్యాలకు గురవుతున్నారని యువకులు, విద్యార్థులు మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ లక్ష్య సాధనకై కష్టపడాలని ఏఎస్ఐ శాముల్ సూచించారు.