BDK: ఆళ్లపల్లి పీహెచ్సీలో కుక్కకాటు వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయని వైద్యాధికారి తెలిపారు. గతంలో కేసులు పెరగడంతో టీకాల కొరత ఏర్పడగా ప్రస్తుతం సరిపడా నిల్వలు ఉన్నాయని పేర్కొన్నారు. బాధితులు ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందాలని సూచించారు. అవసరమైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.