SKLM: పట్టణంలో ఓ నగల దుకాణం ప్రారంభోత్సవానికి శనివారం సినీనటి నేహా శెట్టి విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆమె చేతుల మీదుగా జిల్లా పోలీసు శాఖ ‘డ్రగ్స్ వద్దు బ్రో, సంకల్పం, నారి శక్తి’ గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్‌తో కుటుంబాలు నాశనం అవుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొన్నారు.