ELR: కామవరపుకోట మండలం కొత్తూరులో వైసీపీ నేతలు ఆదివారం నిరసన చేపట్టారు. ఏలూరుపాడులో అంబేడ్కర్ ఫ్లెక్సీనీ ఎమ్మెల్యే రఘురామ తొలగించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ ఇంఛార్జ్ కంభం విజయరాజు పాల్గొని మాట్లాడారు. వెంటనే రఘురామ అంబేడ్కర్‌కు, అంబేడ్కర్ వాదులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.