GDWL: ఇంటర్ ఫలితాలను ఇకపై వాట్సాప్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చని గద్వాల డిస్ట్రిక్ట్ మేనేజర్ శివ తెలిపారు. విద్యార్థులు 8096958096ను ‘మీసేవ తెలంగాణ’గా సేవ్ చేసుకుని, ‘HI’ అని సందేశం పంపాలన్నారు. అనంతరం ‘BIE Exam Result’ అని టైప్ చేసి, రోల్ నంబర్ నమోదు చేస్తే ఫలితాలు వెంటనే మొబైల్కు అందుతాయన్నారు. మీసేవ ద్వారా 580 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు.