సత్యసాయి: రైతులకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా అండగా నిలవాలని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ప్రెసిడెంట్, డైరెక్టర్లకు ధర్మవరం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జ్ పరిటాల శ్రీరామ్ సూచించారు. తాడిమర్రి పీఏసీఎస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు బసికొండ రవీంద్ర, నాగార్జున రెడ్డి నియమితులయ్యారు. మంగళవారం పరిటాల శ్రీరామ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.