రెండవ దేవరాయల కాలంలో తిరుమల భక్తులకు ప్రసాదంగా తిరుప్పొంగం ఇచ్చేవారు. అనంతర కాలంలో మనోహరపడి, సుక్కీయం, అప్పం.. తదితర వాటిని స్వామివారికి సమర్పించేవారు. 1803లో బ్రిటిషువారు ప్రసాదాల విక్రయాలు ప్రారంభించారు. అప్పట్లో వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. అనంతరం మహంతుల హయాంలో తీపి బూందీ ఇచ్చేవారు. ఈ ప్రసాదమే కొంతకాలంలో లడ్డూగా మారింది. 1940ల్లో మిరాశీదార్లలో ఒకరైన కళ్యాణం అయ్యంగార్ ఇచ్చిన లడ్డూ ప్రసాదానికి విశేషమైన ఆదరణ లభించింది.