కలియుగంలో ‘కలౌ వేంకటనాయక’ అన్నారు కదా! అందుకే శ్రీనివాసుని ప్రసాదం ముందు సాటిరాగల పదార్థాలు ఏవైనా ఉంటాయా అన్న రీతిలో దేవదేవుని ప్రసాదాలు అత్యంత రుచికరంగా ఉంటాయి. తిరుమల కొండల్లో ప్రవహించే నీరు, వాతావరణం, ఆలయంలో పోటు.. అన్నీ కలిసి స్వామివారి ప్రసాదాన్ని విశిష్టంగా నిలుపుతున్నాయి. లడ్డూ తయారీలో సెనగపిండి, చక్కెర, జీడిపప్పు, యాలకులు, ఆవు నెయ్యి, కలకండ, ఎండుద్రాక్ష.. తదితర పదార్థాలు వినియోగిస్తారు. ఈ ప్రసాదానికి పేటెంట్ ఉంది.