Kasarla Shyam: గేమ్ ఛేంజర్‌లో నెల్లూరి నెరజానను మరిపించే సాంగ్
సినిమా లిరికల్ రైటర్ కాసర్ల శ్యామ్ పాట గురించి, తన రచన గురించి అనేక ఆసక్తి విషయాలను పంచుకున్నారు. ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూసేయండి.
Kasarla Shyam: సినిమాలకు పాటలు రాయడం మాములు విషయం కాదు, డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ విజన్‌ను అందుకోవాలంటే ఒక ప్రత్యేకమైన అనుభవం ఉండాలని రచయిత కాసర్ల శ్యామ్ చెప్పారు. ఆయన రాసిన మొదటి పాట మహాత్మ సినిమాలో నీలపూరి గాజుల ఓ నీల వేణి పాట చాలా పెద్ద హిట్ అయిందని, ఆ తరువాత లై సినిమాలో బాంబాటుగుందిరో పోరీ సాంగ్‌లో పరిశ్రమలో నిలబడ్డాను అన్నారు. ఆ తరువాత జానపదాలు కూడా రాయడం ఇష్టం అని అన్నారు. అలాగే ఆయన రాసిన అన్ని పాటల్లో చమ్కీల అంగిపెట్టి పాట గురించి చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అలాగే రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో ఒక పాట రాసినట్లు అది నెల్లూరి నెరజాన లాంటి పాట అవుతున్నట్లు చెప్పారు. దాని గురించి శంకర్ చెప్పిన మాటలు చెప్పారు. అలాగే భారతీయుడు 2 సినిమా ఎందుకు మంచి టాక్ తెచ్చుకోలేదో ఆయన మాటల్లో చెప్పారు. ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలంటే ఈ ఇంటర్వ్యను పూర్తిగా చూసేయండి.