భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ గాయపడింది. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఆమెకు మోకాలి నొప్పి మళ్ళీ తిరగబెట్టింది. దీంతో హర్మన్ ఫీల్డింగ్‌కు రాలేదు. దీనిపై బీసీసీఐ స్పందిస్తూ.. ప్రస్తుతం ఆమెను వైద్య బృందం పర్యవేక్షిస్తోందని తెలిపింది. అయితే, 36 ఏళ్ల హర్మన్ గత కొంత కాలంగా మోకాలి నొప్పితో బాధపడుతోంది.