»Double Ismart Purina Mazaka Huge Business For Double Ismart
Double Ismart: పూరినా మజాకా.. ‘డబుల్ ఇస్మార్ట్’కు భారీ బిజినెస్!
లైగర్ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఇక్కడితో పూరి పనైపోయినట్టేనని అన్నారు. కానీ పూరి ఎగిసిపడే అలలాంటి వాడు. ఎన్ని ఫ్లాపులొచ్చినా సరే.. సినిమాలు చేస్తునే ఉంటాడు. అంతేకాదు.. తన క్రేజ్‌కు డబుల్ ఇస్మార్ట్ బిజినెసే నిదర్శనం అని చెప్పాలి.
Double Ismart: Purina Mazaka.. Huge business for 'Double Ismart'!
Double Ismart: డైనమిక్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పెన్ పవర్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. తూటాల్లా పేలే డైలాగ్స్ రాయడం పూరికే సాధ్యం. ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చిన పూరి.. లైగర్ సినిమాతో మాత్రం దారుణాతి దారుణమైన ఫ్లాప్ అందుకున్నాడు. ఈ సినిమా భారీగా నష్టాలను తెచ్చిపెట్టింది. ఇప్పటికీ బయ్యర్స్‌కు, పూరికి మధ్య సెటిల్మెంట్ కాలేదు. ఈ ఎఫెక్ట్ డబుల్ ఇస్మార్ట్ సినిమా పై పడేలా ఉంది. కానీ ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి.
తొలుత ఏరియాల వారిగా రైట్స్ సేల్ చేయాలని భావించారు పూరి, ఛార్మి. కానీ లైగర్ కారణంగా.. డబుల్ ఇస్మార్ట్ రైట్స్ అవుట్ రేట్ సేల్ చేశారు. డబుల్ ఇస్మార్ట్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ దక్కించుకుంది. నిర్మాత నిరంజన్ రెడ్డి వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్.. 54 కోట్లకు కొనుగోలు చేసినట్టుగా సమాచారం. లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత పూరి సినిమా అంత రేట్ పలకడం అంటే.. అది కేవలం పూరీ క్రేజ్ అనే చెప్పాలి. అలాగే.. ఇస్మార్ట్ శంకర్, రామ్ క్రేజ్ కూడా ఈ సీక్వెల్‌కు బాగా కలిసొచ్చింది. గతంలో ఇస్మార్ట్ శంకర్ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు, నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది.
అందుకే.. డబుల్ ఇస్మార్ట్‌కు భారీ బిజినెస్ జరిగిందనే చెప్పాలి. ఇక థియేట్రికల్ రైట్స్ తోనే ఇంత భారీ మొత్తంలో వచ్చాయంటే.. ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ఎలాగూ ఉండనే ఉన్నాయి. అవి కూడా భారీ ధర పలికే అవకాశం ఉండడంతో నిర్మాత పూరి, ఛార్మీలకు లైగర్ నష్టాన్ని పూడ్చేలా ఉంది డబుల్ ఇస్మార్ట్. ఇక సినిమా కంటెంట్ పరంగా చూస్తే.. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్ సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగస్టు 15న వరల్డ్ వైడ్‌గా డబుల్ ఇస్మార్ట్ థియేటర్లలోకి రానుంది. మరి పూరి ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.