»Actress Poonam Kaur Comments On Trivikram Srinivas
Poonam Kaur: త్రివిక్రమ్‌లో ఇంకో కోణం ఉంది.. జీవితాలను నాశనం చేస్తాడు
టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరోక్కసారి త్రివిక్రమ్‌పై ఘాటు విమర్శలు చేసింది. ఇతరుల జీవితాలను నాశనం చేస్తాడు అని తానకు మేల్ ఈగో ఎక్కువ అని సోషల్ మీడియాలో రాసుకొచ్చింది. అలా కాదు అన్న వారిపై కూడా పూనమ్ విరుచుకపడింది.
Actress Poonam Kaur comments on Trivikram Srinivas
Poonam Kaur: నటి పూనమ్ కౌర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలో నటిస్తూనే యాక్టివిస్ట్‌గా పులు అంశాలపై స్పందిస్తుంది. తాజాగా సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై పూనం కౌర్ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. జల్సా సినిమాలో త్రివిక్రమ్ రాసిన రేప్ డైలాగ్స్‌ను ఉద్దేశించి తాను సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టారు. త్రివిక్రమ్ నుంచి ఇంతకు మించి కంటెంట్‌ను ఆశించలేము అని రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. మీకున్న పర్సనల్ ద్వేశాన్ని ఇలా సోషల్ మీడియాలో బయటపెట్టకండి అని ఒకరు కామెంట్ చేశారు. అతని కామెంట్‌కు పూనమ్ కౌర్ కౌంటర్ ఇచ్చారు. త్రివిక్రమ్ ఎలాంటివాడో నాకు బాగా తెలుసని అన్నిరు. అతినిలో ఈవిల్ నేచర్ గురించి చాలా మందికి తెలియదు అనేలా రాసుకొచ్చారు.
త్రివిక్రమ్‌లో చెడు స్వాభావం గురించి నాకు బాగా తెలుసు, ఆయనతో నీకున్న అనుభవం మంచిది కావోచ్చు కానీ నాకు ఉన్న అనుభవం చేదుది అని పూనమ్ కౌర్ చెప్పారు. ఆయన తలుచుకుంటే జీవితాలనే నాశనం చేయగలడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దానికి తాను కూడా బాధితురాలే అనే అర్థం వచ్చేలా రాసుకొచ్చారు. అంతేకాదు ఆయన దగ్గరకి వెళ్లి తనకు ఎలాంటి అన్యాయం చేశాడో, వేరే వాళ్ల చేతం ఏం చేయించాడో త్రివిక్రమ్‌నే అడగండి అని పూనమ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవడంతో ఆ ట్వీట్‌ను పూనమ్ తొలగించింది. దానికి ముందే చాలా మంది దాన్ని స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.
ఇంతకీ జల్సా సినిమాలో రేప్ గురించి రెండు డైలాగ్స్ ఉంటాయి. మొదట కమెడీయన్ సత్యం రాజేస్ సరదాగా టీజ్ చేస్తాం, సిరీయస్‌గా రేప్ చేస్తాం అని అంటాడు. ఆ మాటలకు హీరో అతన్ని కొడుతాడు. తరువాత హీరోయిన్ పవన్ కల్యాణ్ ఇంటిపైన ఉన్నప్పుడు బ్రహ్మనందంతో మత్తు కలిపిన పాలు ఇచ్చి, వాటిని హీరోయిన్‌కు ఇవ్వు మత్తులో ఉన్నప్పుడు రేప్ చేస్తా అంటాడు. దాంతో ఆ పాలు బ్రహ్మనందం తాగుతాడు. అప్పుడు పడుకున్న అమ్మాయిని రేప్ చేస్తే కిక్ ఉండదు.. పరిగెత్తే అమ్మాయిని రేప్ చేస్తేనే కిక్ అని అంటాడు. వీటిని ఉద్దేశించిన పూనమ్ కామెంట్స్ పెట్టింది.