NLG: కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈనెల 27న హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన్ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి సాగర్ పిలుపునిచ్చినారు. మంగళవారం నల్లగొండ పట్టణంలో సభకు సంబంధించిన పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. నిత్యం ప్రజా ఉద్యమాలు చేసేది కమ్యూనిస్టులే అన్నారు.