KDP: రబీ వ్యవ సాయ అవసరాలకు కడప, అన్నమయ్య జిల్లాలకు 2900 టన్నుల యూరియా సోమవారం కడప రైల్వే రేక్ పాయింట్‌కు వచ్చింది. ఈ మేరకు వచ్చిన ఎరువులను కడప, అన్నమయ్య నంద్యాల, కర్నూలు జిల్లాకు సరఫరా చేశారు. ఇందులో కడప జిల్లాకు 2,390 టన్నులు రాగా.. ఇందులో మార్క్‌ఫెడ్ 1,200 టన్నులు, ప్రైవేట్ డీలర్లకు 1,190 టన్నులు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.