»Nokia Nokia Is Launching Three New Feature Phones
Nokia: మూడు కొత్త ఫీచర్ ఫోన్లను విడుదల చేసిన నోకియా
నోకియా బ్రాండ్ మూడు కొత్త ఫీచర్ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 25 ఏళ్ల తర్వాత 3210 మోడల్‌ను మళ్లీ ప్రవేశపెట్టింది. వీటితో పాటు నోకియా 235 4జీ, నోకియా 220 4జీ పేరుతో మరో రెండు ఫోన్లను తీసుకొచ్చింది.
Nokia: Nokia is launching three new feature phones
Nokia: నోకియా బ్రాండ్ మూడు కొత్త ఫీచర్ ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 25 ఏళ్ల తర్వాత 3210 మోడల్‌ను మళ్లీ ప్రవేశపెట్టింది. వీటితో పాటు నోకియా 235 4జీ, నోకియా 220 4జీ పేరుతో మరో రెండు ఫోన్లను తీసుకొచ్చింది. ఈ ఫోన్లు యూట్యూబ్, యూపీఐ ఫీచర్లతో వస్తున్నాయి. నోకియా 3210 ఫోన్లో 1450mAh బ్యాటరీ ఇచ్చారు. ఇది దాదాపు 9:30 గంటల పాటు టాక్ టైం వస్తుందట.
ఈ ఫీచర్ ఫోన్లు ఎప్పటికీ గుర్తుండే స్నేక్ గేమ్, 2 ఎంపీ కెమెరా, ఫ్లాష్ టార్చ్ కూడా ఉన్నాయి. వీటితో పాటు స్మార్ట్‌ఫోన్ తరహాలో యూపీఐ పేమేంట్లు చేయవచ్చు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి పే చేయవచ్చు. యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్‌తో పాటు వెధర్, న్యూస్, క్రికెట్ స్కోర్, 2048 గేమ్‌తో సహా 8 యాప్స్ ఇందులో ఇచ్చారు. కంపెనీ దీని ధరను రూ.3,999గా నిర్ణయించింది. స్కూబా బ్లూ, బ్లాక్, Y2k గోల్డ్ రంగుల్లో ఈ మొబైల్ లభిస్తుంది.
నోకియా 235 4జీలో 2.8 అంగుళాల ఐపీఎస్ డిస్ప్లే, 2 ఎంపీ కెమెరా అమర్చారు. దీని ధర రూ.3,749గా కంపెనీ పేర్కొంది. బ్లూ, బ్లాక్, పర్పల్ రంగుల్లో లభిస్తుంది. నోకియా 235 4జీ ధర రూ.3,249గా నిర్ణయించింది. ఈ ఫోన్ టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తోంది. పీచ్, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఈ మూడు ఫోన్లూ యూట్యూబ్, యూట్యూబ్ మ్యూజిక్, యూపీఐ ఫీచర్లతో వస్తున్నాయి. హెచ్ఎండీ, అమెజాన్‌తో పాటు ఇతర రిటైల్ దుకాణాల్లో కొనుగోలు చేయొచ్చని కంపెనీ వెల్లడించింది.