KTR : పలు యూట్యూబ్ ఛానళ్లకు మాజీ మంత్రి కేటీఆర్ వార్నింగ్
కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. బాధ్యతగా వహించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు.. కొన్ని ఆధారాలు లేకుండా పదే పదే అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR : కొన్ని యూట్యూబ్ ఛానెళ్లకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు. బాధ్యతగా వహించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు.. కొన్ని ఆధారాలు లేకుండా పదే పదే అసత్య ప్రచారం చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా థంబ్ నెయిల్స్ పెట్టి , వార్తల పేరుతో శుద్ధ అబద్ధాలు చూపుతున్నారని మండి పడ్డారు. అధికార పక్షం నుంచి డబ్బు ఆశతో ఇలాంటి నేరపూరిత, అక్రమ వీడియోలు, ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంపై కేటీఆర్ నిప్పులు చెరిగారు.
ఇది వ్యక్తి గతంగా నాతో పాటు, మా పార్టీకి నష్టం కలిగించే కుట్రలో భాగమని మేము భావిస్తున్నాము. ఇది ప్రజలను గందరగోళపరచడానికి, తప్పుదోవ పట్టించే చర్య మాత్రమే అని మేము భావిస్తున్నాము. గతంలో మాపై అసత్య ప్రచారాలు, అవాస్తవాలు ప్రసారం చేసిన మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు కూడా ప్రారంభించినట్లు వివరించారు. ప్రస్తుతం కొన్ని YouTube ఛానెల్‌లు చేస్తున్న ఈ నీచమైన, కుట్రపూరిత చర్యలను చట్టపరంగా ఎదుర్కొందాం.
అడ్డగోలు థంబ్ నెయిల్స్ లు పెట్టి, వార్తల పేరుతో అసత్య ప్రచారం చేసే యూట్యూబ్ ఛానళ్లపై పరువు నష్టం కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇది కాకుండా, ఆ యూట్యూబ్ ఛానెల్‌లను నిషేధించాలని వారు యూట్యూబ్‌కి అధికారిక ఫిర్యాదు కూడా చేస్తామన్నారు. ఇప్పటికైనా తమ తీరు మార్చుకోవాలని విజ్ఞప్తి చేసిన కేటీఆర్.. కుట్రపూరిత వ్యవహారాలు నడుపుతున్న యూట్యూబ్ ఛానెల్స్‌కు చట్ట ప్రకారం తగిన శిక్షకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నట్లు తెలిపారు.