Lok Sabha Speaker Election: Election of Om Birla as Lok Sabha Speaker
Lok Sabha Speaker Election: లోక్సభ స్పీకర్గా మరోసారి ఓం బిర్లా ఎన్నికయ్యారు. 18వ లోక్సభ స్పీకర్ కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి అయిన ఓం బిర్లా విజయం సాధించారు. మూడోరోజు లోక్సభ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అయితే ఇంతకు ముందు సమావేశం ప్రారంభమైన తర్వాత సభలో ప్రధాని మోదీ లోక్సభ స్పీకర్ కోసం ఓం బిర్లా పేరును ప్రతిపాదించారు. దీనికి రాజ్నాథ్ సింగ్తో పాటు మరికొందరు మద్దతు ఇచ్చారు. కానీ విపక్షాలు మద్దతు ఇవ్వకపోవడంతో ఎన్నిక చేపట్టారు. ఓం బిర్లాపై విపక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్ సభ్యుడు కొడికునిల్ సురేశ్ పోటీ చేశారు. అతని మీద ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికయ్యారు. 1976 తర్వాత లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నికల జరగడం ఇదే మొదటిసారి. స్వతంత్ర భారతదేశంలో లోక్సభ స్పీకర్ పదవికి 1952, 1967, 1976లో మాత్రమే ఎన్నికల జరిగాయి.