GNTR: కష్టపడిన వారిని గుర్తించడమే టీడీపీ సిద్ధాంతమని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరిలో ‘మై టీడీపీ యాప్’ టాప్-10 పెర్ఫార్మర్స్తో ఆయన భేటీ అయ్యారు. ఉత్తమ కార్యకర్తలను సత్కరించి ఎన్టీఆర్ జ్ఞాపికను బహూకరించారు. మీ పనితీరు వల్లే ఇక్కడి వరకు రాగలిగారని అభినందించారు. పార్టీ సిద్ధాంతాలను, కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని అన్నారు.