PDPL: గర్భస్థ శిశు లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం చట్టవిరుద్దమని DMHO డా. ప్రమోద్ కుమార్ తెలిపారు. ఇవాళ జిల్లా ఆసుపత్రిలో నిర్వహించిన PCPNDT సమావేశంలో ఆయన పాల్గొన్నారు. గర్భస్థ శిశు లింగ నిర్ధారణ చేసిన వారికి, చేయమని అడిగిన వారికి 3 సంవత్సరాలు జైలు శిక్ష, రూ. 10,000 జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొన్నారు. సమావేశంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.