AP: తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామ్భూపాల్ రెడ్డి సుప్రీంకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించారు. కాటసాని పిటిషన్పై సీజేఐ ధర్మాసనం విచారణ జరిపింది. కాటసానికి భద్రతపై సెక్యూరిటీ రివ్యూ కమిటీ మరోసారి సమీక్ష చేయాలని ధర్మాసనం సూచించింది. భద్రత అవసరమో, కాదో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.