Horoscope Today: నేటి రాశిఫలాలు(2024 June 18th)..అప్పులు తొలగిపోతాయి.
ఈ రోజు(2024 June 18th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
మేషం
విదేశయాన ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో లాభాలు ఏర్పడుతాయి. అనుకోకుండా ధననష్టాన్ని అధిగమిస్తారు. ఇస్టమైన వ్యక్తులను కలుస్తారు. అనారోగ్య బాధలు ఉన్నాయి.
వృషభం
మొదలు పెట్టిన పనులు వెంటనే ఫలిస్తాయి. ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. కొత్త వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. అప్పులు తొలగిపోతాయి.
మిథునం
మానసిక ఆందోళనలు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. మొదలు పెట్టిన పనులు ఆలస్యంగా సఫలమవుతాయి. చెడు పనులకు దూరంగా ఉండాలి. మీమీగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి.
కర్కాటకం
గౌరవ మర్యాదలు కాపాడుకుంటారు. వృథా వ్యయప్రయాసలు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. మానసిక ఆందోళనలు ఉన్నాయి. బంధుమిత్రులతో వైరం ఏర్పడకుండా చూసుకోవాలి. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది.
సింహం
ఊహించని కార్యాల్లో పాల్గొంటారు. మీమీరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవలేక పోతారు. వృధా వ్యయప్రయాసల వల్ల ఆందోళన చెందుతారు. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి.
కన్య
అనుకోని ధనలాభం ఉంది. రాజకీయ రంగంలోనివారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ప్రతీ విషయంలో విజయాన్నే సాధిస్తారు. సన్నిహితులను కలుస్తారు. శుభవార్తలు వింటారు.
తుల
రాజకీయ వ్యవహారాల్లో ముందుకు వెళ్తారు. మొదలు పెట్టిన పనులన్ని సంపూర్ణంగా ఫలిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు నెరవేరుతాయి. పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు చేస్తారు. శుభవార్తలు వింటారు.
వృశ్చికం
అధిక ప్రయాణాలు చేస్తారు. అనుకోకుండా ధననష్టం ఏర్పడుంతి. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. దైవదర్శనం చేసుకుంటారు. స్త్రీల వలన ఆనందాన్ని పొందుతారు.
ధనుస్సు
కొత్త వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన ఫలితం లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. మనోధైర్యాన్ని కలిగి ఉంటారు.
మకరం
చంచలనం వలన మానసిక ఆందోళనలు ఏర్పడుతాయి. ఇంటిలో మార్పులు కోరుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహ పడుతారు. మొదలు పెట్టిన పనులన్ని ఫలిస్తాయి.
కుంభం
ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. కొత్త వస్తు, ఆభరణాలు పొందుతారు. సంఘంలో కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.
మీనం
అపకీర్తి రాకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు ఉంటాయి. మనస్సును శాంతంగా చూసుకోవాలి.