»Viral Post Is Shobhita Single Is Naga Chaitanya Also There
Shobhita: వైరల్ పోస్ట్.. శోభిత ఒంటరిగానే ఉందా? నాగ చైతన్య కూడా ఉన్నాడా?
అక్కినేని నాగ చైతన్య, సమంతతో పాటు.. శోభిత ధూళిపాళ్ల వ్యవహారం కూడా ఎప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంటుంది. తాజాగా శోభిత చేసిన పోస్ట్ చూస్తే.. అమ్మడు చైతన్య కోసమే ఎదురు చూస్తుందా? అని అనిపించక మానదు.
Viral post.. Is Shobhita single? Is Naga Chaitanya also there?
Shobhita: సమంతతో విడిపోయిన తర్వాత.. నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకోలేదు. సామ్‌తో విడాకుల తర్వాత చై ఒంటరిగానే ఉంటున్నాడని అనుకున్నారు అంతా. కానీ హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో మాత్రం డేటింగ్ చేస్తున్నాడని గత కొద్ది కాలంగా ప్రచారంలో ఉంది. ఆ మధ్య తెలుగు బ్యూటీ శోభితతో చైతన్య సీక్రెట్‌గా ఎఫైర్ మెయింటేన్ చేస్తున్నాడనే వార్తలు వైరల్ అయ్యాయి. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు గానీ.. ఇప్పటి వరకు స్పందించలేదు నా చైతన్య. దాంతో సందర్భం వచ్చినప్పుడల్లా ఈ ఎఫైర్ తెరపైకి వస్తునే ఉంది. ఆ మధ్య ఈ ఇద్దరు కలిసి పక్కపక్కనే ఉన్నట్టుగా ఓ ఫోటో బయటికి వచ్చింది. అది కూడా చైతూ బర్త్ డే సందర్భంగా ఈ ఫోటో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో.. ఇద్దరి మధ్య ఎఫైర్ నిజమేననే అనుకున్నారు. ప్రస్తుతానికైతే.. చైతన్య, శోభిత ఎవరి సినిమాలతో వారు బిజీగా ఉన్నారు.
కానీ ఇప్పుడు శోభిత చేసిన ఓ పోస్ట్‌తో మళ్లీ వీళ్ల వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా శోభితా వెకేషన్‌కు వెళ్లింది. అందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో షిప్లో ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తు.. ఎవరి కోసమే విరహ వేదనతో ఎదురు చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. అలాగే హోటల్లో ఉన్న ఫోటోల్లో ఎవరినో గట్టిగా మిస్ అవుతున్నట్టుగా ఉంది. దీంతో.. అమ్మడు నాగ చైతన్య కోసమే ఎదురు చూస్తోంది.. అతన్నే మిస్ అవుతోందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు.. ఆమె ఒంటరిగా వెకేషన్‌కు వెళ్లలేదని, చైతూనే ఈ ఫోటోలను తీసి ఉంటాడని.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా.. ప్రస్తుతం శోభితా వెకేషన్ ఫొటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.